మల్యాల మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు పంట కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన కొనేదిక్కు లేకుండా పోయిందని మండల బిజెపి నాయకులు సోమవారం మల్యాల తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పలు గ్రామాల్లో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలనే ప్రారంభించని దుస్థితి. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలను పోసుకొని రైతులు రోజుల తరబడి పంట కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న దయనీయ పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాలన్నీ వడ్ల కుప్పలతో నిండిపోయి, స్థలం లేక రైతులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. వాతావరణ పరిస్థితులు, పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి రైతులు పంట కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో చేస్తున్న ప్రకటనకు ఆచరణకు పొంతన లేకుండా పోయింది. రైతుల పంట కొనుగోళ్ళ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు,కొర్రీలు పెట్టకుండా పూర్తిస్థాయిలో పంటను కొనుగోలు చేయాలని బిజెపి మండల శాఖ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము. పంట కొనుగోళ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని,వడ్ల కొనుగోళ్ల ను తక్షణం ప్రారంభించాలని,అన్ని రకాల సన్న వడ్లకు మద్దతు ధర చెల్లించి,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూపాయలు 500 బోనస్ ఇవ్వాలని మండల బిజెపి శాఖ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు,బోట్ల ప్రసాద్,గాజుల మల్లేశం,సంఘని రవి,నులుగోoడ సురేష్,కెల్లేటి రమేష్,బొబ్బి వెంకటస్వామి యాదవ్,అవదుర్తి రమ,మల్లేశం యాదవ్,లక్ష్మారెడ్డి,జనగం రాములు,ముకుంద గంగాధర్,కొణిదెల రాజన్న,లక్ష్మారెడ్డి,గడ్డం చిన్న మల్లేశం,సంకుర్తి తిరుపతి,సామ మైపాల్ రెడ్డి,చిలువేని నవీన్,మల్లేశం గౌడ్,రుత్త కిషన్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.











