హడావుడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 20 రోజులు గడుస్తున్న కొనుగోళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, రిబ్బన్ కటింగ్ లకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిమితమైనట్లు జిల్లా బీజేపీ ఓబీసీ అధ్యక్షుడు దూలం కళ్యాణ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులకు ఓ ప్రకటనలో తెలియజేస్తూ రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట కొనడానికి ప్రభుత్వం అన్ని విధాల ఏర్పాట్లు సరిగా లేనందున రోడ్డు పైన పోసుకున్న వడ్లు వర్షానికి తడుస్తున్నాయని కాంగ్రేస్ నాయకులు రిబ్బన్లు కటింగ్ చేసి 20 రోజులైన వాటిని కొనే పరిస్థితి లేదని బీజేపీ కరీంనగర్ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు దూలం కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల పరిస్థితి రోలు పోయి రోకలికి చెప్పుకున్నట్లుందని,ఇప్పటికైనా వడ్లు కొనకపోతే రెండు రోజుల్లో బీజేపీ పక్షాన ధర్నాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
Post Views: 36











