ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఎడారి దేశంలో భారీవానలు..వరదలు చూసి తీరాల్సిందే

Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

అది ఒక ఎడాది దేశం.. మండే ఎండలు తప్ప వాన చినుకు ఏడాది రెండేళ్లకు ఒకసారి కూడా రాలదు. వర్షపు చినుకు కోసం ఏళ్లకు ఏళ్లు అక్కడి ప్రజలు ఎదురు చూస్తారు.

కానీ, అలాంటి దేశం ఇప్పుడు భారీ వర్షాలకు అతలాకుతలమవుతోంది. వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. రోడ్లు నదులుగా మారాయి. రోడ్లపై వరద చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విమానాల రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది.

దుబాయ్‌లో భారీ వర్షాలు..
ప్రపంచంలో చోటుచేసుకుంటున్న వాతావణ మార్పులకు దుబాయ్‌ అద్దం పడుతోంది. ఎటు చూసినా ఇసుక దిబ్బలు.. తవ్వితే ఆయిల్‌ తప్ప చుక్క నీరు రాని ఎడాది దేశం దుబాయ్‌. అలాంటి దేశం ఇప్పుడు వర్షాలు, వరదలతో అతలాకులమవుతోంది. విస్తుగొలిపే అంశమే అయినా తాజాగా దుబాయ్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో రోడ్లపై నీరు నిలిచింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విమానాల రాకపోకలకూ అంతరాయం కలిగింది. కొన్నింటిని దారి మళ్లించారు. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.

శనివారం తెల్లవారుజాము నుంచి..
దుబాయ్‌లో శనివారం తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురుస్తోంది. ఈమేరకు అక్కడి వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. దుబాయ్‌లో ఏడాది సగటు వర్షపాతం 120 మిల్లీమీటర్లు. శనివారం ఆరు గంటల్లో 50 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి అక్కడి చెట్లు విరిగిపడ్డాయి. స్పందించిన అధికారులు హుటాహుటిన రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించారు. విచిగిన చెట్లు తొలగించారు. డ్రెయినేజీలు ఖాళీ చేయించారు.

ట్రాఫిక్‌కు అంతరాయం..
భారీ వర్షాలకు దుబాయ్‌లోని ప్రధాన రహదారులపై వరద చేరడంతో నదులను తలపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మరోవైపు ఆదివారం కూడా పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అస్థిర వాతావరణం క్రమంగా బలహీనపడి.. ఆదివారం సాయంత్రానికి వర్షం తూర్పు ప్రాంతాలకే పరిమితమవుతుందని వెల్లడించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్