అమెరికాకు మరో ఉపద్రవం.. ఆందోళనలో ప్రజానీకం

Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

బర్డ్‌ ఫ్లూ అనగానే పక్షులకు వస్తుందని తెలుసు. కోళ్లు ఎక్కుగా బర్డ్‌ఫ్లూ బారిన పడతాయి. అయితే తాజాగా అమెరికాలు ఆవులకు కూడా బర్డ్‌ ఫ్లూ సోకింది.

ఆవు పాలల్లో బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు టెక్సాస్‌ యనిమల్‌ హెల్త్‌ మిషన్‌ అధికారులు గుర్తించారు. AH5N1 టైపు వైరస్‌గా ధ్రువీకరించారు. ఇది దశాబ్దాలుగా పక్షుల్లో వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు అప్‌గ్రేడ్‌ అయి పశువులకు సోకిందని, మనుషులకు సోకే అవకాశం కూడా ఉందని గుర్తించారు.

ఆరు రాష్ట్రాల్లో వైరల్‌..
అమెరికాలోని టెక్సాస్, కాన్సాస్, న్యూ మెక్సికో సహా ఆరు రాష్ట్రాల్లోని ఆవులకు బర్డ్‌ఫ్లూ సోకిందని తెలిపారు. వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సొకే ప్రమాదముందని, ప్రజలకు అత్యంత చేరువగా వైరస్‌ వచ్చిందని పేర్కొంటున్నారు. వైరస్‌ కారణంగా ఆవుల్లో పాల దిగుబడి తగ్గుతుందని తెలిపారు. పౌల్ట్రీలలో బర్డ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న పొలంలో మేకలుకు వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయిందని మిన్నెసోటా అధికారులు ప్రకటించారు. వారం తర్వాత ఇది ఆవులకు సోకిందని వెల్లడించారు. దీనిని అత్యంత వ్యాధికారక ఏవీయన్‌ ఇన్ఫూ›్లయెన్సా అని కూడా పిలుస్తారని తెలిపారు.

ప్రజలకు ప్రమాదం తక్కువ..
అయితే ఊరట నిచ్చే అంశం ఏమిటంటే పాలద్వారా మనిషికి సోయే అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపారు. డైరీలు ఆరోగ్యకరమైన జంతువుల నుంచి మాత్రమే పాల సరఫరాకు అనుమతి ఇవ్వాలని సూచించారు. అనారోగ్యంతో ఉన్న జంతువుల నుంచి పాలు తీసుకోవద్దని తెలిపారు. పాశ్చరైజేషన్‌ వైరస్‌ను చంపుతుందని తెలిపారు.

జంతువులకు తొలిసారి..
ఇదిలా ఉండగా బర్డ్‌ఫ్లూ హెచ్‌5ఎన్ 1 టైప్‌-ఏ ఆవులకు సోకడం ఇదే తొలిసారి అని అక్కడి వైద్య వర్గాలు చెబుతున్నాయి. బద్ధకం, ఆకలి లేకపోవటం వంటి లక్షణాలు ఆవుల్లో కనపడటంతో వైరస్‌బారిన పడిన సంగతి గుర్తిస్తున్నామని, దీంతో పాల ఉత్పత్తిని తగ్గించామని రైతులు చెబుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్